బీఫాంలు అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

బీఫాంలు అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు

Published Fri, Apr 19 2024 1:40 AM

కేసీఆర్‌ చేతుల మీదుగా బీఫాంలు అందుకుంటున్న సుధీర్‌ కుమార్‌, కవిత - Sakshi

హన్మకొండ/మహబూబాబాద్‌: బీఆర్‌ఎస్‌ వరంగ ల్‌, మాహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థులు మారపల్లి సుధీర్‌కుమార్‌, మాలోత్‌ కవిత బీఫాంలు అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్లమెంట్‌ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స మావేశం అనంతరం పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌.. ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌, ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, సిరికొండ మధుసూదనాచారి, సత్యవతి రా థోడ్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌ , హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement