కోడిపిల్లను గాబులో వేశాం.. | Sakshi
Sakshi News home page

కోడిపిల్లను గాబులో వేశాం..

Published Fri, Apr 19 2024 1:40 AM

ఇక తిరుగేలేదు - Sakshi

బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ కాని కోడిపిల్ల(భద్రాచలం ఎమ్మెల్యే) ను గాబులో వేశాం.. ఇక కాంగ్రెస్‌కు తిరుగేలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్‌లో శుక్రవారం నిర్వహించే సీఎం బహిరంగసభకు జనసమీకరణ నిమిత్తం గురువారం బయ్యారంలోని కోదండరామచంద్రస్వామి ఫంక్షన్‌హాల్‌లో గార్ల–బయ్యారం మండలాల్లోని పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పది ఎమ్మెల్యే స్థానాల్లో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలవగా భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచారన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి (కోడిపిల్లగా మంత్రి సంబోధించారు) కాంగ్రెస్‌లో చేరడంతో పదికి పది కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉన్నాయని.. ఇక మనం ఏ అభివృద్ధి పని గురించి అడిగినా సీఎం రేవంత్‌ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో మిగతా పార్టీల దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. సీఎం బహిరంగ సభకు పార్లమెంట్‌స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించనున్నామన్నా రు. ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ను గె లిపించే బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్య త తాము తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, గార్ల జెడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ నాగరాజు, బయ్యారం, గార్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముసలయ్య, రామారావు, సొసైటీ చైర్మన్లు మధుకర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు

Advertisement
 
Advertisement