సాధారణ ప్రసవాలు పెరగాలి | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రసవాలు పెరగాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

కురవి: సూచనలు చేస్తున్న డీఎంహెచ్‌ఓ   - Sakshi

నెహ్రూసెంటర్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖప్రసవాలు జరిగేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్లు చేయాలని సూచించారు. గర్భిణులను 12వారాల్లోపు నమోదు చేయాలని, వందశాతం వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలన్నారు. బీపీ, షుగర్‌, కేన్సర్‌ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ఉదయం పూటనే పనులు ముగించుకోవాలని, ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అంబరీష, ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్‌రావు, సుధీర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, శ్రవణ్‌కుమార్‌, డిప్యూటీ డెమో ప్రసాద్‌, డీపీహెచ్‌ఎన్‌ మంగమ్మ, డీపీఎం రుక్ముద్దీన్‌, వసంత ఉన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

కురవి: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. లేబర్‌ రూం, మందుల నిల్వ గది, ఐఎల్‌ఆర్‌, వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అంబరీష, డీపీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, పీహెచ్‌సీ మెడికల్‌ అధికారి డాక్టర్‌ విరాజిత, సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ కళావతిబాయి

Advertisement
 
Advertisement