ఎన్నికల సందడి | Sakshi
Sakshi News home page

ఎన్నికల సందడి

Published Fri, Apr 19 2024 1:35 AM

- - Sakshi

శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

8లోu

సాక్షి, మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల సందడి మొదలైంది. గురువారం నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11నుంచి సాయంత్రం 3గంటల వరకు మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అభ్యర్థుల నుంచి మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా మొదటి రోజు గురువారం ఒక్క నామినేషన్‌ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ఫ్రీవెరిఫికేషన్‌ మొదలైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక నిఘా, రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. వీడియో, ఫొటోగ్రఫీతోపాటు రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ముహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈమేరకు తెలిసిన పండితులతో తమ పేరు బలం, ముహూర్తం చూపించుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు బలరాంనాయక్‌, మాలోత్‌ కవిత, అజ్మీరా సీతారాంనాయక్‌లతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు తమకు అనుకూలమైన తేదీల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్‌ నామినేషన్‌ హంగామాతో వేసేలా ఆపార్టీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30గంటలకు బలరాంనాయక్‌ నామినేషన్‌ వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్‌ వేసిన తర్వాత సాయంత్రం 5గంటలకు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్‌ కూడా తమదైన శైలిలో నామినేషన్‌ వేయనున్నారని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్‌ 18 నుంచి 25వ తేదీ వరకు ..(ఆదివారం మినహా అన్ని పనిదినాల్లో ఉదయం 11నుంచి సాయంత్రం 3 గంటల వరకు)

స్క్రూట్ని: ఏప్రిల్‌ 26న

నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్‌ 29వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు

పోలింగ్‌ : మే 13న మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అలాగే ములుగు, పినపాక, ఇల్లెందు , భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌ జరగనుంది.

ఓట్ల లెక్కింపు: జూన్‌ 4వ తేదీన

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు

న్యూస్‌రీల్‌

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌తో

నామినేషన్ల ప్రక్రియ షురూ..

మానుకోటలో తొలిరోజు

ఒక్క నామినేషన్‌ దాఖలు

నేడు కాంగ్రెస్‌ అభ్యర్థి

బలరాంనాయక్‌ నామినేషన్‌

కలెక్టరేట్‌లో తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

డోర్నకల్‌ 1,09,150 1,13,455 07 2,22,612

మహబూబాబాద్‌ 1,26,611 1,31,794 46 2,58,451

నర్సంపేట 1,15,068 1,20,370 09 2,35,447

ములుగు 1,13,592 1,19,172 27 2,32,791

పినపాక 99,824 1,03,798 05 2,03,627

ఇల్లెందు 1,09,812 1,15,094 04 2,24,910

భద్రాచలం 72,925 79,597 07 1,52,529

మొత్తం 7,46,982 7,83,280 105 15,30,367

1/2

2/2

Advertisement
 
Advertisement