సర్వర్‌ డౌన్‌.. టెండర్లు ఆలస్యం | Sakshi
Sakshi News home page

సర్వర్‌ డౌన్‌.. టెండర్లు ఆలస్యం

Published Wed, Apr 17 2024 1:25 AM

ఆలస్యంగా చేపడుతున్న కాంటాలు  - Sakshi

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్‌ సర్వర్‌డౌన్‌ కారణంగా మంగళవారం టెండర్లు ఆలస్యమయ్యాయి. దీంతో సాయంత్రం వరకు రైతులు పడిగాపులు పడాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కెట్‌కు 5వేల బస్తాలకు పైగా మక్కలు అమ్మకానికి వచ్చాయి. అదే విధంగా ధాన్యం, మిర్చి, పత్తి ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి వచ్చాయి. రోజు మాదిరిగానే మధ్యాహ్నం 12.30 గంటలకు టెండర్లు పూర్తయి, విన్నర్‌ లిస్టు విడుదల చేయాల్సి ఉండగా ఈ–నామ్‌ సర్వర్‌ సమస్య కారణంగా పలువురు వ్యాపారులు టెండర్లు వేయలేకపోయారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో విన్నర్‌ లిస్టు విడుదల అయింది. ఆ తర్వాత సరుకులకు పెట్టిన ధరలను రైతులకు తెలిపారు. దీంతో సాయంత్రం 3.30 గంటలకు కాంటాలు మొదలు కాగా, రాత్రి వరకు కాంటాలు, తొలకాలు జరిగాయి. అప్పటి వరకు రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతూ, ఎండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ–నామ్‌ సర్వర్‌ సమస్య అంతటా తలెత్తిందని, దీని కారణంగా టెండర్లు ఆలస్యమయ్యాయని మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ సెకట్రరీ అమరలింగేశ్వరరావు తెలిపారు.

సరుకుల వద్ద రైతుల పడిగాపులు

Advertisement
Advertisement