అభ్యర్థుల తరఫున కుటుంబీకుల ప్రచారం | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల తరఫున కుటుంబీకుల ప్రచారం

Published Tue, Nov 14 2023 1:18 AM | Last Updated on Tue, Nov 14 2023 1:18 AM

- - Sakshi

గడపగడపకూ వెళ్తూ గెలిపించాలని వేడుకోలు

సందడిగా మారుతున్న పల్లెలు, పట్టణాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ప్రచార పర్వం ప్రారంభించగా ప్రస్తుతం ఊపందుకుంది. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫున కుటుంబీకులు పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం చేపడుతున్నారు. తండ్రి కోసం తనయులు, సోదరుల తరఫున తోబుట్టువులు, మామ కోసం కోడలు, భర్త కోసం భార్య.. ఇలా సకుటుంబ సపరివార సమేతంగా ప్రచార పర్వంలో భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగా పల్లె నుంచి పట్టణం వరకు గడపగడపకూ వెళ్తున్నారు. ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement