వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

పగిడ్యాల: భార్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పగిడ్యాల అంబేడ్కర్‌ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుని భార్య నాగమణి తెలిపిన వివరాలు.. స్థానిక అంబేడ్కర్‌ కాలనీకి చెందిన నాగరాజు అలియాస్‌ ఏసు(29) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం నందికొట్కూరులో బీరు తెచ్చుకుని తాగి తనతో గొడవ పడినట్లు తెలిపింది. ఇంతకుముందు ఫోన్‌ పే చేసిన రూ.12 వేలు ఇవ్వాలని వేధించడంతో చిన్న మామ సామేలు ఇంటి వద్దకు వెళ్లినా వదలకుండా వెంటపడి కొట్టాడని వివరించింది. దెబ్బలకు తట్టుకోలేక ఇంటి వెనుక కల్లంలో దాక్కున్నట్లు తెలిపింది. ఈక్రమంలో నాగరాజు తాను ఉరి వేసుకుంటున్నట్లు బంధువులకు సమాచారం ఇవ్వగా వారు తనకు చెప్పడంతో వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నట్లు భార్య నాగమణి తెలిపింది. కాగా నాగరాజు మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement