బనగానపల్లె: మండలంలో గ్యాస్ వినియోగదారుల కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సిలిండర్ బుక్ చేసి 30 – 40 రోజులైనా వినియోగదారులకు అందడం లేదు. అయితే బుకింగ్ చేసిన వారం రోజులకే సిలిండర్‌ను డెలివరీ చేసినట్లు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తుండటం గమనార్హం. గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్‌లు వినియోగదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీ కార్యాలయం వద్దకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగిన వారికి మాత్రం అప్పటికప్పుడు డెలివరీ రిసిప్ట్ ఇచ్చి గోడౌన్ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గౌడౌన్ ఉంది. అక్కడికి వెళ్లి సిలిండర్ తెచ్చుకునేందుకు మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గౌడౌన్ వద్ద భారీ ఎత్తున వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ లో వేచి ఉన్నారు. వారంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు అధికారులకు తెలిసినా సదరు డీలర్‌పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ వద్ద సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని, ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
వ్యాపారులకు ఫుల్‌గా గ్యాస్
ప్రభుత్వం సుమారు 40 రోజులుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంలేదు. అయినా ఆహార వ్యాపారుల వద్ద గృహ వినియోగ సిలిండర్లు ఫుల్‌గా ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్‌లో వ్యాపారులకు ఒక్కో సిలిండర్ రూ.1700–1900 ఆదాయంతో విక్రయిస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు. ఇళ్లకు సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఏజెన్సీ వద్దకు వచ్చి రికార్డులను తనిఖీ చేసి గౌడౌన్‌ను పరిశీలించి డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి గ్యాస్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.


