అ‘పూర్వం’.. మధుర జ్ఞాపకం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వం’.. మధుర జ్ఞాపకం

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

సంజామల: మండల పరిధిలోని నొస్సం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు 31 సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. 1994–1995 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు బుధవారం నొస్సం పాఠశాల వేదికగా కలుసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు లక్ష్మిరెడ్డి, రామిరెడ్డి, దినకర్‌ నాయుడు, కృష్ణ మూర్తి, నాగయ్య, సుబ్రమణ్యం, ఖాజ హుస్సేన్‌, రామచంద్రయ్యను నొస్సం బురుజు వద్ద నుంచి పాఠశాల వరకు బ్యాండ్‌మేళంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వివిధ హోదాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్ధులు రజనీ, సాయికుమారి, శివశంకర్‌ రెడ్డి, సుబ్బరంగయ్య, రామకృష్ణరెడ్డి, సంజీవ, హైదర్‌ బాష, ఆలీబాషా, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement