‘గాలి’ వైద్యం! | - | Sakshi
Sakshi News home page

‘గాలి’ వైద్యం!

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా మనిషి మూఢనమ్మకాలను వీడలేకపోతున్నాడు. ఇప్పటికీ దెయ్యం పట్టిందనే అపోహతో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తాయత్తులు, అంత్రాలు కట్టించుకొని నయమైనట్లుగా భ్రమపడుతున్నారు. చివరకు వ్యాధి ముదిరి మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సర్జికల్‌ విభాగం వద్ద కొందరు మహిళలు ఓ మహిళను జుట్టు పట్టుకొని కొడుతున్నారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈమెను విడిచి పో అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని వేడుకగా చూస్తున్నారు. ఏమైందోనని ‘సాక్షి’ ఆరా తీయగా.. ఆమెకు కొద్ది రోజులుగా మానసిక సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని మానసిక వ్యాధుల విభాగంలో చేర్చినా ఉండటం లేదన్నారు. గాలి సోకినట్లుగా భావించి ఇలా చేయిస్తున్నట్లు ఆమె సంబంధీకులు చెప్పడం గమనార్హం. – కర్నూలు(హాస్పిటల్‌)

Advertisement
 
Advertisement
Advertisement