కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్–ఫార్మాసీ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలకు మొత్తం 3,432 మందికిగాను 3,173 మంది హాజరయ్యారు. కర్నూలు నగరంలో నాలుగు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒకొక్క కేంద్రం ఏర్పాటు చేయగా ఉదయం 1,011 మందికిగాను 926 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1382 మందికిగాను 1266 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం 369 మందికి 346 మంది, మధ్యాహ్నం పరీక్షకు 670 మందికి 635 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల దగ్గర సందడి నెలకొంది. ఉదయం 7.30 గంటల నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు.


