తగ్గిన ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ఉష్ణోగ్రతలు

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌ నెలలోనే రికార్డు స్థాయి లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందనే ప్రచారం జరిగి ంది. అయితే అక్కడక్కడ వర్షాలు పడటం, గా లుల తీవ్రత కొనసాగుతోంది. ఈ కారణాలతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మంత్రాలయంలో 41.5,చిప్పగిరిలో 41.2, కౌతాళంలో 41.4, హలహర్విలో 41.1, దొర్నిపాడులో 40.7, సంజామలలో 40.7,కొత్తపల్లిలో 40.5, ఆళ్లగడ్డలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో ప్రభావం మొదలైనందున ఈ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులుంటాయని వా తావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు మండలా ల్లో వర్షం కురిసింది. ఓర్వకల్‌లో 16.4 మి.మీ, కల్లూరులో 4.4, వెల్దుర్తిలో 3.2, కర్నూలు రూరల్‌లో 1, కర్నూలు అర్బన్‌లో 0.8 మిమీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

నేటి నుంచి

ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి(మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్‌, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్‌ కన్వీనర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్‌ కేంద్రాల మూసివేత

కర్నూలు(అర్బన్‌): ఏపీఈఏపీసెట్‌–2026 పరీక్షల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను ఆయా సమయాల్లో మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్‌ కె.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారన్నారు. ఆయా సమయాల్లో జీరాక్స్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను తెర చి ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉర్దూ యూనివర్సిటీ

డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల

కర్నూలు కల్చరల్‌: డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన మొదటి సెమిస్టర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.షావలి ఖాన్‌ విడుదల చేశారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్‌ www.ahuuk.ac.inలో అందుబాటులో ఉన్నాయని ఇన్‌ఛార్జి వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహబుబ్‌ బాషా, ఎగ్జామినేషన్స్‌ కో ఆర్డినేటర్స్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌, డాక్టర్‌ నబియా సుల్తాన, డాక్టర్‌ బి. వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో

పడిపోయిన ధరలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా వేరుశనగ, వాము, మొక్కజొన్న, కందులు, శనగల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్‌లో సగటున లభించిన ధర రూ.6,100 మాత్రమే. మార్కెట్‌కు 759 క్వింటాళ్ల వాము రాగా.. సగటున క్వింటాకు లభించిన ధర రూ.16,299. గరిష్టంగా రూ.24,444 ధర లభించినప్పటికీ ఈ ధర ఒకటి, రెండు లాట్‌లకే పరిమితం కావడం గమనార్హం. మొక్కజొన్నలు మార్కెట్‌కు 231 క్వింటాళ్లు రాగా లభించిన సగటు ధర రూ.1,727. కందులకు సగటున రూ.7712, శనగలకు రూ.5,380 ప్రకారం ధరలు లభించాయి. మార్కెట్‌కు ఉల్లి రావడం బాగా తగ్గిపోయింది. కేవలం నలుగురు రైతులు 125 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తీసుక రాగా రూ.767 ధర మాత్రమే లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement