అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

ఎమ్మిగనూరు రూరల్‌: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో ని కె.నాగలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రా మానికి చెందిన కె. రామాంజనేయులు(38)కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. తనకున్న 2 ఎకరాల పొలానికి తోడు మరో 4 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, ఇంటి ఖర్చులకు బయటి వ్యక్తుల వద్ద దాదాపు రూ.8 లక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటలు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 9వ తేది రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తెలిపారు.

జూనియర్‌ సివిల్‌

జడ్జీల బదిలీ

కర్నూలు: జిల్లాలో జూనియర్‌ సివిల్‌ జడ్జీ పోస్టుల ను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సి విల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీ గా ఉన్న రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కో ర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement