కర్నూలు(సెంట్రల్): పీజీఆర్‌ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్‌తో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సునీత, రామసుబ్బయ్య పాల్గొన్నారు.
వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ఏగ్రేడ్
జిల్లాలో ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు నిర్వహించిన హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ గణనలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని జిల్లా సమగ్రంగా ఏ గ్రేడు సాధించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి(ఆదోని), ప్రాంతీయ వైద్యశాల(ఎమ్మిగనూరు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు కోడుమూ రు, వెల్దుర్తి, పత్తికొండ, ఆలూరులకు ఏ గ్రేడు, ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి బీ గ్రేడు లభించిందన్నారు.


