ఐచర్‌ వాహనం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఐచర్‌ వాహనం దగ్ధం

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

● రెండు తులాల బంగారం చైన్‌, నగదు అపహరణ

పత్తికొండ రూరల్‌: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్‌ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్‌ వాహనం సిమెంట్‌ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్‌ లోడింగ్‌ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఇంజన్‌లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది.

ప్రయాణికురాలి

బ్యాగ్‌కు కన్నం

హొళగుంద: బస్టాండులో దొంగలు బస్సెక్కుతున్న మహిళా బ్యాగుకు కన్నం వేసి బంగారు చైను, నగదు కొట్టేసిన సంఘటన సోమవారం ఉదయం హొళగుందలో చోటు చేసుకుంది. స్థానిక తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) పక్కన వన్నూరు కొట్టాలకు వెళ్లే దారిలో నివాసం ఉంటున్న వట్టికుట్టి శాంతమ్మ అనే మహిళ ఉదయం ఆదోని వెళ్లేందుకు హొళగుంద బస్టాండుకు వచ్చింది. బస్సు రాగానే అందరితో కలసి బస్సెక్కి సీట్లో కూర్చుంది. టికెట్‌ కోసంఆధార్‌ కార్డు తీసేందుకు బ్యాగ్‌ చూడగా చిరిగి ఉండటం, అందులో రెండు తులాల బంగారు చైనుతో పాటు దాదాపు రూ.10 వేలుకు పైగా ఉన్న నగదు కనబడలేదు. వెంటనే ఆమె బస్సు దిగి భర్త వట్టికుట్టి ప్రభాకర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పగా ఆయన అక్కడికి చేరుకుని విచారించి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బస్టాండ్‌లో చోరీ జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

21 మందికి కారుణ్య నియామకాలు

కర్నూలు(సెంట్రల్‌): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. జేసీ నూరుల్‌ ఖమర్‌, ఇన్‌చార్జ్‌ డీఆర్వో చిరంజీవి, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్‌ సిబ్బంది సన పాల్గొన్నారు.

గవర్నర్ల వ్యవస్థను

రద్దు చేయాలి

శ్రీశైలం: దేశంలో జరుగుతున్న గవర్నర్ల నియామకాల వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కుంచం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనర్థమై సోమవారం శ్రీశైలం వచ్చిన ఆయన స్థానిక దేవస్థానం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 153 ఆధారంగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నార్నారు. సంబంధిత రాష్ట్రాలకు గవర్నర్‌ కార్యనిర్వాహక అధిపతి మాత్రమేనని, రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ మంత్రి మండలికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తారే కానీ ఎటువంటి నిర్ణయం, చర్యలు తీసుకునే అధికారం లేదని అన్నారు. ప్రస్తుతం గవర్నర్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయన్నారు. రాష్ట్ర గవర్నర్ల వ్యవహారాల తీరును వివరిస్తూ తమిళనాడులో ఇటీవల చోటు చేసుకు న్న పరిణామాలు దారుణమన్నారు. ఎన్నికల్లో విజయ్‌కి మెజారి టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్‌ తీవ్ర జాప్యం చేయడం సబబు కాదన్నారు.

లా సెమిస్టర్‌ పరీక్షలకు

ఐదుగురు గైర్హాజరు

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో సోమవారం జరిగిన 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ 8వ సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. 74 మందికి 69 మంది హాజరు కాగా 93 శాతం హాజరు నమోదైందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement