వామ్మో.. వంతెన | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. వంతెన

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ రహదారిలో మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందరవాగుపై ఏర్పాటు చేసిన వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిటీష్‌కాలంలో 1932లో వాగుపై ఇరుకై న వంతెన ఏర్పాటు చేశారు. వంతెన నిర్మించి 94 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఏర్పాటు చేసిన కడ్డీలు ఒకవైపు వంగిపోవడంతోపాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనకు సైడ్‌వాల్స్‌ లేకపోవడంతో గతంలో వాహనాలు వాగులో పడి ప్రయాణికులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై ప్రయాణసమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా వాహనాలు వాగులోపడి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు దెబ్బతిన్న వంతెన స్థానంతో కొత్తగా వంతెన ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement