లేబర్‌ కోడ్‌లను రద్దు చేయకపోతే ఐక్య పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయకపోతే ఐక్య పోరాటాలు

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

కర్నూలు(సెంట్రల్‌): కేంద్ర ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చి అమలు చేస్తున్న లేబర్‌ కోడ్‌లను వెనక్కి తీసుకోకపోతే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధమవుతారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయూనియన్‌ ఆల్‌ ఇండియా కమిటీ పిలుపు మేరకు సుందరయ్య సర్కిల్‌లో న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో లేబర్‌కోడ్‌ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. నగర అధ్యక్షుడు వై.నగేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నరసింహులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన వెంటనే లేబర్‌ కోడ్‌లను అమల్లో తేవడానికి నోటిఫికేషన్‌ విడుదల చేయడం దారుణమన్నారు. ఫలితంగా ఇప్పటి వరక కార్మికులకు అండగా ఉన్న చట్టాలు రద్దై నాలుగు కోడ్‌లు మాత్రమే అమల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. వీటి ప్రకారం 13 గంటల పని విధానం అమల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఆనంద్‌బాబు, టి.రాముడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement