డ్రైవరూ.. టైరు జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

డ్రైవరూ.. టైరు జాగ్రత్త

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

● టైర్ల నిర్వహణపై అవగాహన లోపం ● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో మరింత జాగ్రత్తంటున్న నిపుణులు

● టైర్ల నిర్వహణపై అవగాహన లోపం ● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో మరింత జాగ్రత్తంటున్న నిపుణులు

సాక్షి, నంద్యాల: ‘వాహనాలు కండిషన్‌లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయిస్తున్నాం’ .. అని ధీమాగా ఉంటే సరిపోదు. వాహనాల కండిషన్‌, ఇంధనం మాత్రమే కాదు.. టైర్లు, అందులో గాలి తరచూ సరి చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి.. వాటిలో సరిపడినంత గాలి ఉందా.. తక్కువ/ఎక్కువగా ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి టైరుకు కాలపరిమితి ఉంటుంది. తర్వాత కాల పరిమితి తగ్గిపోతుంది. రబ్బరు గట్టిపడడంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు, గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాలు ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

ఆ అక్షరమే... భద్రతకు కీలకం..

టైరు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్‌ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైక్‌లు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్పీడ్‌ రేటింగ్‌ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్‌ స్పీడ్‌ రేటింగ్‌ అక్షరాలలో ఉంటుంది. ప్రతి టైర్‌పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్‌ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫా బెటికల్‌ అక్షరం చాలా కీలకమైంది. దాన్ని టైర్‌ స్పీడ్‌ రేటింగ్‌ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడ ల్‌కు తగిన స్పీడ్‌ రేటింగ్‌ నిర్ణయిస్తాయి. డ్రైవర్‌ డోర్‌ వద్ద ఉండే స్టిక్కర్‌ లేదా వాహన మాన్యువల్‌లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్‌ చేసేవారు హెచ్‌, వి రేటింగ్‌ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణు లు చెబుతున్నారు. సాధారణంగా టైర్ల మన్నిక కాలం ఐదారేళ్లు ఉంటుంది. కొత్త టైర్‌ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైందనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం.

ద్విచక్ర వాహనాలు 2,74,768

ఆటోలు 16,631

కార్లు 16,832

గూడ్స్‌ వాహనాలు 12,839

ట్రాక్టర్లు 21,583

జీపులు, క్యాబ్‌లు,

స్కూల్‌ బస్సులు 4,607

జిల్లాలో వాహనాల వివరాలు ఇలా...

Advertisement
 
Advertisement
Advertisement