గుంతలు.. వాన పడితే మడుగులు | - | Sakshi
Sakshi News home page

గుంతలు.. వాన పడితే మడుగులు

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

గుంతలమయమైన రహదారిలో చిన్నపాటి వర్షానికి నీరు చేరడంతో వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మండల కేంద్రమైన కౌతాళంలో బాపురం రోడ్డు అధ్వానంగా మారింది. రెండు రోజు ల క్రితం కురిసిన చిన్న పాటి వర్షానికి రో డ్డులో గుంతలు పూర్తిగా నీటితో నిండి మడుగులను తలపిస్తున్నాయి. ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి వెలుగు కార్యాలయం వరకు బురదదారిలో ప్రయాణించ డం కష్టంగా మారింది. వాహనదారులు ఊరు దాటాలంటే భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నివాసముంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. అడుగు బయటపెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కొందరు టెంకాయ పీచు సహాయంతో బురద దారిని దాటుతున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. – కౌతాళం

Advertisement
 
Advertisement
Advertisement