వసతుల కల్పనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వసతుల కల్పనకు చర్యలు

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

● ఆర్‌యూ వీసీ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు

● ఆర్‌యూ వీసీ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో వసతులను మెరుగు పరుస్తామని మర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవ రావు అన్నారు. శనివారం వర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్‌ కళాశాలకు అనుబంధంగా అదనపు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఏకై క ఇంజినీరింగ్‌ కళాశాల అయిన వర్సిటీ కళాశాల విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.విజయ్‌కుమార్‌ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార పుచ్చ వెంకట సుందరానంద్‌, డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య ఎన్‌. నరసింహులు, బోటనీ ప్రొఫెసర్‌ భరత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement