మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట | - | Sakshi
Sakshi News home page

మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్త జన సంద్రంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. మద్దిలేటయ్య నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది.

Advertisement
 
Advertisement
Advertisement