టీడీపీ నాయకులు తాళాలు వేసిన దేవనకొండ ఉపాధి హామీ కార్యాలయం ఇది. నెల్లిబండ, దేవనకొండ, మాచాపురం ఫీల్డ్ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న వారిని తొలగించాలని టీడీపీ నాయకులు ఎంపీడీఓను కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని ఆయన చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లను బలవంతంగా రాజీనామా చేయించాలని ‘ఉపాధి’ సిబ్బందిని టీడీపీ నాయకులు బెదిరించారు. అంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో ఉద్యోగులు భయపడుతూ గురువారం ఒక్కరు కూడా విధులకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కార్యాలయాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి కార్యాలయాన్ని తెరిపించారు.


