మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వా మి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీ మఠంలో రద్దీ కనపించింది. మూల బృందావ న దర్శనానికి రెండు గంటలకు పైగా సమ యం పట్టింది.రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రాక అధికమైంది.
8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు సీఈఓ జీవీ రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘాల సభ్యులు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన సమాయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు.
ఆర్‌ఆర్‌బీ, ఏపీ హైకోర్టు పరీక్షలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు–లోకో పైలెట్, గ్రూప్–డీ, ఏపీ హైకోర్టు –2026 రిక్రూట్‌మెంట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కులాల అభ్యర్థులకు స్థానిక ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20లోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం, అబ్బాస్‌నగర్, కర్నూలు చిరునామాలో అందించాలన్నారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఎస్‌ఎస్‌సీ, డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తాన్నారు. ఈ నెల 25వ తేది నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇతర వివరాలకు 08518–236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
21 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకెండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 25,819 మంది విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించారు. పరీక్షలకు మొత్తం 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి వచ్చే నెల 7 నుంచి 11వ తేదీ వరకు కేవలం జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీ, వొకేషనల్ విద్యార్థులకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
అధ్యాపక నియామక
నోటిఫికేషన్లు రద్దు
కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయంలో ఖాళీగా ఉన్న 63 అధ్యాపక పోస్టుల భర్తీకి 2023లో జారీ చేసిన నియామక నోటిఫికేషన్లు రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్‌చార్జి వైస్ ఛాన్స్‌లర్, వర్సిటీ ఎఫ్‌ఏసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ షావలి ఖాన్ తెలిపారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 69, తేదీ 06.05.26 మేరకు అధ్యాపక పోస్టుల భర్తీకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. ఆయా నోటిఫికేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు రీఫండ్ వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://ahuuk.ac.in లో తెలుసుకోవచ్చన్నారు.
టీబీ డ్యాంలో 10 టీఎంిసీల నీరు
హొళగుంద: తుంగభద్ర డ్యాంలో గురువారం ఉదయం నాటికి 105.788 టీఎంసీలకు గాను 10.190 టీఎంిసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర దిగువ(ఎల్లెల్సీ) కాలువలో గురువారం నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో జీరో ఉండగా అవుట్‌ఫ్లో 454 క్యూసెక్కులుంది.


