● భద్రతా లోపాలున్న 61 బస్సులకు నోటీసులు జారీ
కర్నూలు: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో రవాణా శాఖ అధికారులు బడి బస్సుల తనిఖీలు విస్తృతం చేశారు. డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఎంవీఐలు, ఏఎంవీఐలు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 582 పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 38 విద్యాసంస్థలను సందర్శించి 168 పాఠశాలలు, కళాశాలల బస్సులను అధికారులు తనిఖీ చేశారు. ఈనెల 15లోపు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని తనిఖీ సందర్భంగా అధికారులు ఆదేశిస్తున్నారు. భద్రతా లోపాలున్న 61 బస్సులకు లోపాల ను సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అగ్నిప్రమాద భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు.


