25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

కర్నూలు(అర్బన్‌): స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఫెడరేషన్‌ దేశ వ్యాప్తంగా ఈ నెల 25, 26వ తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు కర్నూలు మాడ్యూల్‌ డీజీఎస్‌ పి.విద్యాసాగర్‌ తెలిపారు. గురువారం స్థానిక మాడ్యూల్‌ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ బ్యాంకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన సామాజిక బాధ్యతను బ్యాంకు విస్మరిస్తోందన్నారు. బ్యాంకులో శాశ్వత స్వభావం కలిగిన పనులను అవుట్‌ సోర్సింగ్‌ చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో ఏజీఎస్‌లు పి.శ్రీకాంత్‌, కె.ప్రవీణ్‌, అసిస్టెంట్‌ ట్రెజరర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement