గోనెగండ్ల: మెరుగైన సేవలతో గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీకి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. టీక్యూఎస్ సంస్థ సభ్యులు పీఎం ప్రేమానంద్, ఆడిటర్ ఇమామ్, సాయికృష్ణ గురువారం గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 52 గ్రామపంచాయతీలు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయన్నారు. వాటిలో మొదటి విడతలో 24 పంచాయతీలు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు పొందేందుకు అర్హత పొందాయని తెలిపారు. ఇందులో భాగంగా 19వ పంచాయతీగా గోనెగండ్ల గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యదర్శి సతీష్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ అనంతసేన, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
కర్నూలు కల్చరల్: అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి అన్నారు. సర్కిల్ కార్యాలయంలో రెనోవేషన్ చేసిన అటవీ శాఖ గెస్ట్ హాస్‌ను డీఎఫ్‌ఓ పి. శ్యామలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎఫ్ మాట్లాడుతూ.. రూ. 34 లక్షలతో సర్కిల్ కార్యాలయం, మీటింగ్ హాల్, గెస్ట్ హౌస్‌లను రెనోవేషన్ పనులు చేపట్టి ఆధునీకరించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దామన్నారు. కర్నూలు డివిజన్‌లోని నగర వనాల్లో ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ సుభాన్, డీఆర్‌వోలు ఓబులేస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


