కర్నూలు సిటీ: సర్కార్ బడిలో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగ్ తదితరాలతో విద్యను అందిస్తున్నట్లు డీఈఓ ఎల్.సుధాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని సీ క్యాంపు సమీపం శ్రీరాంనగర్, రైతు బజార్ ప్రాంతాల్లో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా అవగహన ర్యాలీ నిర్వహించారు. డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ శ్రీధర్ పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అర్హత కలిగిన చిన్నారులను ఒకటవ తరగతి తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వయస్సు నిండిన చిన్నారులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలన్నారు. బోధనలో అత్యంత అనుభవం, అర్హత కలిగిన టీచర్లు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు చౌడయ్య, రెహ్మాన్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రఫీ, సీ్త్ర శిశు సంక్షేమ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
పసుపుల గ్రామ పంచాయతీకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ పంచాయతీ ఐఎస్‌ఓ సర్టి ఫికెట్‌కు ఎంపికై ంది. బుధవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి.భాస్కర్, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిన 18వ గ్రామ పంచాయతీగా పసుపుల గ్రామ పంచాయతీ ఎంపికై ందన్నారు. నిర్దిష్ట కాలమాన సేవలు, మెరుగైన నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన సేవలతోనే అరుదైన గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి రఘునాథ్, టిక్యూఎస్ సంస్థ ప్రతినిధి సీఎం ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.
రూ.60 కోట్లతో
26 రోడ్ల పనులు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాస్కీలో భాగంగా రూ.60 కోట్లతో 26 రోడ్ల పునరుద్ధరణ పనులు(110 కిలోమీటర్ల మేర) చేపట్టనున్నట్లు పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు జి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ కింద ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని అందిస్తోందన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఒకే ప్యాకేజీ కింద ఈ పనులను చేపడతామన్నారు.
క్యాజువాలిటీ ఆకస్మిక తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ విభాగంలో బుధవారం రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని డీఏపీ, డీఏఎస్‌లకు మెమోలు జారీ చేశారు. చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది విధిగా విధుల్లో ఉండాలని, లేనివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ పద్మజ తదితరులు ఉన్నారు.
బాలికపై లైంగిక దాడి
● యువకుడిపై పొక్సో కేసు నమోదు
నందికొట్కూరు: పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన 13 బాకలికపై అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ నెల 2న లైంగికదాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు టౌన్ సీఐ అశోక్ కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. లైంగికదాడి చేసిన యువకుడు బాలికకు సొంత మేనమామ అని తెలిసింది.


