కర్నూలు: సుప్రీం కోర్టులోని పెండింగ్ కేసుల సెటిల్‌మెంట్‌కు ఆగస్టు 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా మధ్యవర్తిత్వ తీర్పు, వివాదాల సామరస్యం కోసం సుప్రీం కోర్టు ఈ చర్య చేపట్టిందన్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లోని చెక్‌బౌన్స్ కేసులు, ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్‌లు, భూసేకరణ సమస్యలను కక్షిదారులు ప్రత్యేక లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో గూగుల్ ఫామ్ htt pr://www.sci.gov.in వెబ్‌సైట్ అందుబాటులో ఉందన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు వారి అంగీకారంతో, వారి న్యాయవాదులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్‌మెంట్ సమావేశాలకు ప్రత్యేకంగా కానీ, వర్చువల్‌గా కాని హాజరుకావచ్చన్నారు. వివరాలకు టోల్‌ఫ్రీ నెంబర్ 15100, 08518–248828 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.


