రెండు నెలలుగా తిరుగుతున్నా
కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నా. నాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కొత్త రేషన్ కార్డు కోసం సచివాలయం–1 చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నా. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది సచివాలయం–4కు వెళ్లమన్నారు. ఇక్కడ ఎంట్రీ చేసిన 21 రోజుల తర్వాత రమ్మన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగున్నా ఫలితం లేకపోతోంది. పనులు మానుకుని కార్డు కోసం తిరగాల్సి వస్తోంది. – గోపాల్, కోసిగి
సచివాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా పనులు జరగడం లేదు. గతంలో వలంటీర్లు ఉండడంతో ఇంటికి వచ్చి సేవలు అందించేవారు. ఇప్పుడు ఏ పనికై నా సచివాలయానికి వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. సర్వేల పేరుతో బయటకు వెళ్తున్నారు. సచివాలయం ఉద్యోగులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.
– కుమార స్వామి, గూళ్యం గ్రామం,
హాలహర్వి మండలం
సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదు. కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా సిబ్బంది ఉండరు. ఒకరో ఇద్దరో ఉంటారు. వారిని అడిగితే సరైన సమాధానం కూడా రాదు. ఫీల్డ్‌కు వెళ్తుతున్నారని చెబుతారు తప్ప పనులు జరగడం లేదు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– వీరేష్, చిన్నమరివీడు గ్రామం
●


