డిజిటల్ అసిస్టెంట్ లేక వెల్దుర్తికి వెళ్తున్నాం
నా భర్త సత్యానంద్(70) నెల క్రితం చనిపోయాడు. ఆయనకు పింఛన్ వచ్చేది. మా గ్రామంలోని సచివాలయానికి వెళ్లి డెత్ సర్టిఫికెట్, నాకు పింఛన్ సౌకర్యం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ నాకు వచ్చేలా చేస్తానన్నారు. వారంగా తిరుగుతూ శనివారం వెళ్లి ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి అడిగితే డిజిటల్ అసిస్టెంట్ లేడన్నారు. ఇతను ఎల్.నగరం సచివాలయంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న డీఏ స్థానంలో డిప్యూటేషన్ చేస్తున్నాడంట. ఆయన అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీ సోమవారం రమ్మన్నారు. ఇక ఎదురు చూడలేక సచివాలయంలో దరఖాస్తు చేసుకునే బదులు వెల్దుర్తి మీ సేవలో అప్లయ్ చేసుకునేందుకు వెళ్తున్నాం. పొలం పనులు మానుకుని కాళ్లీడ్చుకుంటూ తిరుగుతున్నాం.
– సుశీలమ్మ, స్వాములు
(తల్లీ, కొడుకులు), నర్సాపురం గ్రామం


