‘స్క్రబ్‌ టైఫస్‌’ అంటువ్యాధి కాదు | - | Sakshi
Sakshi News home page

‘స్క్రబ్‌ టైఫస్‌’ అంటువ్యాధి కాదు

Dec 7 2025 8:48 AM | Updated on Dec 7 2025 8:48 AM

‘స్క్

‘స్క్రబ్‌ టైఫస్‌’ అంటువ్యాధి కాదు

కూలీ పనులకు వెళ్తూ మృత్యుఒడికి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

కర్నూలు (సెంట్రల్‌): స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్‌ ఆరా తీశారు. నవంబర్‌ నెల నుంచి ఈనెల 6వ తేదీ వరకు 44 పాజిటివ్‌ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని 39 మంది రోగులు డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం ఐదుగురు ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు, కాటు దగ్గర నల్ల రంగు పట్టు (ఎస్కార్‌) లక్షణాలు ఉంటాయని, వెంటనే సమీప పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీని సంప్రదించాలని సూచించారు. జీజీహెచ్‌ కర్నూలులో పరీక్ష చేసి నిర్ధారణ అనంతరం చికిత్స చేస్తార తెలిపారు. రైతులు పొలాల్లో, పొదల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా ఒంటిని కప్పి ఫుల్‌ షర్టులు, ప్యాంట్లు ధరించాలని సూచించారు. సమావేశంలో జీ జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమాదేవి, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ శ్రీరాములు, చిన్నపిల్లల విభాగపు హెచ్‌ఓడీ డాక్టర్‌ విజయానంద్‌ బాబు, పల్మనాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఆదోని అర్బన్‌: పెద్దకడబూరు మండలం తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి(22) రోడ్డు ప్రమాదంలో శనివారం మృతిచెందింది. ఇస్వీ ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి, భర్త గిరిస్వామి కూలీ పని కోసం, మామ ఉరుకుందప్ప పొలం పని కోసం ఆదోనికి బైక్‌పై వెళ్తుండగా మండలంలోని కపటి గ్రామ సమీపంలో గరుసుతోలే ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త గిరిస్వామి, మామ ఉరుకుందప్పకు గాయాలయ్యాయి. సరస్వతికి కుమారుడు, కుమార్తె సంతానం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎకై ్సజ్‌ సిబ్బంది రక్తదానం

కర్నూలు: తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఎకై ్సజ్‌ సిబ్బంది రక్తదానం చేశారు. కర్నూలు ఎకై ్సజ్‌ కార్యాలయ ఆవరణంలో జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్‌ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ రవికుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఎకై ్సజ్‌ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 160 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్థులకు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరిబాబుతో పాటు ప్రతినిధి బృందం కూడా కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.

క్వార్ట్జ్‌ మైన్స్‌పై వ్యతిరేకత

వెల్దుర్తి: బుక్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 214లో నాలుగు ఎకరాల్లో ఎంఎస్‌ ఇన్ఫినిటి మినరల్స్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్న క్వార్ట్జ్‌ అండ్‌ సిలికా శ్యాండ్‌ మైనింగ్‌ ఏర్పాటుకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్‌డీఓ సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ వర్మ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొనగా కంపెనీ ఏర్పాటు తమ పంట పొలాలు దెబ్బతింటాయని, కాలుష్యం పెరుగుతుందని గ్రామ నాయకుడు శంకర్‌ రెడ్డి, రైతులు అధికారుల ఎదుట తమ వాదన వినిపించారు. అంతే కాకుండా గ్రామానికి 4కి.మీల దూరంలో సభ నిర్వహించడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్‌డీఓ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు.

‘స్క్రబ్‌ టైఫస్‌’  అంటువ్యాధి కాదు 1
1/1

‘స్క్రబ్‌ టైఫస్‌’ అంటువ్యాధి కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement