వెటర్నేరియన్ పదాన్ని ఇతరులు వాడరాదు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో వెటర్నేరియన్ అనే పదాన్ని బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ డాక్టర్ కోర్సు చదవిన వారు మాత్రమే వాడుకునేందుకు అర్హత ఉందని ఉమ్మడి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్ అసోషియేషన్ నేతలు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో ఇతరులు వెటర్నేరియన్ అనే పదాన్ని వాడుతున్నారని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ అనే పదాన్ని వాడుకోవచ్చని, ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, వెటర్నేరియన్ అనే పదాన్ని వాడరాదన్నారు. ఇతరులు ఈ పదాన్ని వాడితే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) సెక్షన్ 56, 1984 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. పారా వెటర్నరీ సంఘాలు, నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ పెడరేషన్‌లో వెటర్నేరియన్ అనే పదాన్ని తొలగించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఆర్.నాగరాజు, కార్యవర్గసభ్యుడు వెంకటసుబ్బయ్య, పశువైద్యుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి మనోజ్ అరుణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్ తదిర తులు ఉన్నారు.


