టూవీలర్ ర్యాపిడో వ్యవస్థను రద్దు చేయండి
కర్నూలు: ర్యాపిడో సంస్థలో టూ వీలర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ అనుబంధ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నగర కార్యద ర్శి రాధాకృష్ణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమార్‌ను తన కార్యాలయంలో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఓలా, ఉబేర్, ర్యాపిడో సంస్థలతో ఆటో కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలైన టూ వీలర్లలో ప్రయాణికులను చేరవేస్తూ ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకున్నట్లు లేదని, ర్యాపిడో యాజమాన్యాన్ని పిలిపించి చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఎస్.హుసేన్ వలి, మాలిక్ బాషా, ఖలీల్ అహ్మద్ డీటీసీని కలసిన వారిలో ఉన్నారు.


