దా‘ఉడుమూ’తలు..
కనుక్కోండి చూద్దాం ఆటకు సరిగ్గా సరిపోతుంది ఈ చిత్రం. ఈ చిత్రంతో కంటి చూపును
పరీక్షించుకోవచ్చు. ఇందులో
ఓ జీవి దాగి ఉంది. ఆహారన్వేషణలో దాగుడుమూతలు ఆడుతూ ఆకలి తీర్చుకుంటోంది. ఇంకా గుర్తు పట్టలేదా.. బాగా
చూడండి.. చెట్టు మొదలులో తొర్ర సమీపంలో ఉడుము ఉంది. చెట్టు రంగులో కలసిపోయి పురుగులు, కీటకాలను వేటాడుతోంది. ఈ దృశ్యం శనివారం బ్రహ్మగుండం క్షేత్రంలో కనిపించింది. – వెల్దుర్తి


