రూ.52 వేలు నష్టాపోయాం
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు సగటున రూ.25వేల వరకు పెట్టుబడి వచ్చింది. అధిక వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతినింది. మామూలుగా అయితే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఎకరాకు దిగుబడులు 16 క్వింటాళ్ల వరకే వచ్చింది. దళారులు క్వింటా రూ.1600 ధరతో కొన్నారు. మద్దతు ధర రూ.2400 ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రూ.52 వేలు నష్టపోయాం.
– రాఘవేంద్ర, ఆలూరు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. రైతులు పండించిన ఏ పంటకు కూడా ధరలు లేవు. మాకు 17 ఎకరాల భూములు ఉన్నాయి. మిర్చి, పత్తి, వరి పంటలు సాగు చేశాం. అధిక వర్షాలతో వరి, పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, పత్తిలో దిగుబడులు పడిపోయాయి. 18 నెలల పాలనలోని వైఫల్యాలను దాచిపెట్టేందుకే రైతన్నా.. మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధరలు పడిపోయిన విషయమై ప్రశ్నించాం. స్పందన లేకుండా పోయింది.– నాగభూషణం రెడ్డి,
హెబ్బటం గ్రామం, హొళగుంద మండలం
రూ.52 వేలు నష్టాపోయాం


