జరిమానాలు ఉండవు కేసులే!
హొళగుంద: మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఇక జరిమానాలు ఉండబోవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా హొళగుంద పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ మేరకు నేరాలు, కేసులు, పెండింగ్ కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరు, సమస్యలు ఇలా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగ ఉండాలని, హెల్మెట్‌లపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, మారుతి, ట్రైనీ ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప ఉన్నారు.


