కుమ్మర శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అర్బన్): కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి నూతనంగా జిల్లా, నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం స్థానిక బీసీ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి. పుల్లయ్య ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షులుగా జి. పుల్లయ్య, గౌరవ సలహాదారులుగా కె. సోమేసు, కె. నాగేశ్వరరావు, కె. బజారప్ప, జిల్లా అధ్యక్షులుగా కేసీ నాగన్న, ప్రధాన కార్యదర్శిగా కె. వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా కె. కృష్ణమూర్తి, కె. నరసింహబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కె. పాండురంగస్వామి, కె. శ్రీనివాసులు ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే నగర సంఘానికి గౌరవాధ్యక్షుడిగా కె. లింగన్న, అధ్యక్షుడిగా కె. మధు, ప్రధాన కార్యదర్శిగా కె. గుమ్మకొండ రమేష్, కోశాధికారిగా కె. చిట్టిబాబును సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు జి. పుల్లయ్య మాట్లాడుతూ కుమ్మర్లు విద్యా పరంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కేసీ నాగన్న మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మర్లు అత్యధిక స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలన్నారు.


