గంజాయి రవాణా ముఠా అరెస్టు
డోన్ టౌన్ : పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని కటకటాలకు పంపారు. మంగళవారం పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్‌ఐ శరతకుమార్‌రెడ్డి రైల్వేస్టేషన్ వద్ద గస్తీ చేపట్టారు. డోన్ ఇందిరానగర్ శ్రీనివాస టాకీస్ సమీపంలో నివాసం ఉండే ఈడిగ ఈశ్వర్‌గౌడ్ అలియాస్ గాలిగాడు, పాతపేటకు చెందిన షేక్ హుస్సేన్ అలియాస్ హసన్‌వలి, కొండపేట సుంకాల వసూళ్ల ఆఫీసు సమీపంలో నివాసం ఉండే చాకలి హరికృష్ణ అలియాస్ గుండు స్టేషన్ ఆవరణలో అనుమానంగా కనిపించారు.వెంటనే వారిని అదుపులోకి తనిఖీ చేయగా వారి వద్ద 1250 గ్రాముల గంజాయి లభించడంతో అరెస్టు చేశారు. ఎక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చారు, ఎవరికి విక్రయిస్తున్నారు తదితర వివరాలు విచారణలో తెలుస్తాయని సీఐ తెలిపారు.


