కృష్ణగిరి సహకార సొసైటీ సీఈఓ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కృష్ణగిరి సహకార సొసైటీ సీఈఓ సస్పెన్షన్‌

Dec 2 2025 7:28 AM | Updated on Dec 2 2025 7:28 AM

కృష్ణగిరి సహకార సొసైటీ సీఈఓ సస్పెన్షన్‌

కృష్ణగిరి సహకార సొసైటీ సీఈఓ సస్పెన్షన్‌

వెదురు సాగుకు ప్రోత్సాహకాలు

కృష్ణగిరి: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓగా పని చేస్తున్న కే.శివన్నను సస్పెండ్‌ చేసినట్లు సొసైటీ చైర్మన్‌ కేఈ శేషాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈయన సీఈఓ పని చేస్తూ అలాగే స్థానిక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌లో బిజినెస్‌ కరస్పాండెంట్‌(బీసీ)గా, గతంలో కృష్ణగిరి వెలుగు కార్యాలయంలో ఆగవేళి గ్రామం నుంచి బుక్‌ కీపర్‌గా విధులు నిర్వహిస్తూ జీతభత్యలు పొందినట్లు గుర్తించామన్నారు. బహుళ ఉద్యోగాలు నిర్వహించడం సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధం కావడంతో సీఈఓ విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

టీడీపీ నేత భూ కబ్జా

కలెక్టరేట్‌ ఎదుట మాజీ సైనికుల ధర్నా

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు రూరల్‌ మండలం నందనపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు టీడీపీ నేత రవిగౌడ్‌ కబ్జా చేశాడని బాధిత మాజీ సైనికులు రవి, జాన్‌, విజయ్‌, రాజు,శీను, రాముడు, బుజ్జి, సంజన్న, చిన్న మద్దిలేటి, థామస్‌, రంగన్న, గురునాథ్‌ ఆరోపించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 72 మందికి నందనపల్లెలో కుటుంబానికి 6.5 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అయితే నందికొట్కూరు నుంచి వలస వచ్చిన టీడీపీ నేత రవిగౌడ్‌ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరైనా ఏమైనా ఉంటే తనకు మంత్రి తెలుసు.. ఎమ్మెలే తెలుసూ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. అంతకముందు రవిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

కర్నూలు(అర్బన్‌): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈ నెల 3న నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, అనధికారులు, విభిన్న ప్రతిభావంతులు హాజరు కావాలని ఆమె కోరారు.

ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ పురోగతికి ప్రత్యేకాధికారులు

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇన్నెంటివ్‌ రివిజన్‌–2026లో సన్నద్ధంలో భాగంగా ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ పురోగతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ ప్రక్రియలో పట్టణాలు, నగరాల్లో పురోగతి లోపించింది. ఆ మేరకు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూ రు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కర్నూలుకు నలుగు రు, పాణ్యంకు 5, కోడుమూరుకు ఒక్కరు, ఎమ్మి గనూరుకు ముగ్గరు, ఆదోనికి సంబంధించి ముగ్గురు ప్రత్యేకాధికారులను నియమించారు.

డిగ్రీ పరీక్షల్లో 9 మంది డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో 9 మంది విద్యార్థులను డిబార్‌ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా సోమవారం 822 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో వెదురుసాగును ప్రోత్సహించేందుకు 2025–26 సంవత్సరానికి 15 హెక్టార్లకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లలో మాట్లాడుతూ 2022–23 నుంచి కొంతమంది రైతులు వెదురు సాగు చేపట్టారని, ఇందులో రాణించే అవకాశం ఎక్కువగా ఉండటంతో సబ్సిడీలు ఇచ్చి ప్రొత్స హిస్తున్నట్లు చెప్పారు. హెక్టారుకు రెండేళ్లలో యూనిట్‌ కాస్ట్‌లో రూ.60 వేలు సబ్సిడీ లభిస్తుందన్నారు. మొదటి ఏడాది రూ.36వేలు, రెండో ఏడాది రూ.24 వేలు సబ్సిడీ చెల్లిస్తామన్నారు. బార్డర్‌ క్రాప్‌గా సాగు చేస్తే ఒక మొక్కకు రెండేళ్లలో రూ.150 ప్రకారం ఎన్ని మొక్కలు నాటుకుంటే అన్నింటికీ సబ్సిడీ వస్తుందన్నారు. గ్రామ, మున్సిపాలిటీ, ఇతర ప్రభుత్వ సంస్థల భూము ల్లో వెదురు సాగు చేపడితే 100 శాతం సబ్సిడీ(హెక్టారుకు రూ.1.20 లక్షలు) వర్తిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement