రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగి దుర్మరణం
పాములపాడు: ట్రాక్టర్ ఢీకొని విద్యుత్ శాఖ ఉద్యోగి దుర్మరణం చెందాడు. విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు ట్రాన్స్‌కో కార్యాలయం ఏడీఎం సెక్షన్‌లో వసీం అక్రమ్ (35) జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు ముగించుకొని సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై అతను కర్నూలుకు బయలుదేరాడు. మార్గమధ్యలో పాములపాడు మండలం కృష్ణరావుపేట గ్రామం వద్ద ఎన్‌హెచ్340సీ రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


