గాయపడిన వృద్ధురాలి మృతి
ఎమ్మిగనూరురూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంగమ్మ (68) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలలిపారు. కోటేకట్ గ్రామ మలుపు దగ్గర రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసహళ్లి, బంగరుపేటకు చెందిన ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో గాయపడ్డ గంగమ్మ(68) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. ఇదే ప్రమాదంలో ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మృతుల సంఖ్య ఆరుగురికి చేరుకుంది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ చేతన్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


