రైతు కష్టం మట్టిపాలు
● గిట్టుబాటు ధరలేక
ఉల్లిపంటను దున్నేసిన రైతు
కోసిగి: మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేక వందగల్లు గ్రామానికి చెందిన కాల్వ ఈరన్న తన ఉల్లి పంటను ఆదివారం మట్టిలోనే కలిపేశాడు. తాను మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, ఇప్పటి వరకు రూ.1.50లక్షలు ఖర్చు వచ్చిందని చెప్పారు. ఉల్లి పంట చేతికొచ్చిందని, కోత కోసి మార్కెట్‌లో అమ్ముకుందామనుకున్నా క్వింటా మార్కెట్‌లో రూ.400కు మించి పలకడం లేదన్నారు. చేసేది ఏమీలేక ట్రాక్టర్‌తో దున్నేసినట్లు తెలిపారు. గత వర్షకాలంలో అధిక వర్షాలకు పంటలు పూర్తి దెబ్బతినినష్టం వాటిల్లిందని, ఈ సారైనా ఉల్లిపంటతో గిట్టుబాటు ధర వస్తుందనుకున్నా మరలా అప్పులే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


