నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా? | - | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా?

Dec 1 2025 7:26 AM | Updated on Dec 1 2025 7:26 AM

నిశ్శ

నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా?

జిల్లాలో ఎయిడ్స్‌ బాధితుల

వివరాలు

సంవత్సరం ప్రజలు

అక్టోబర్‌ వరకు

నంద్యాల జిల్లాలో పరిస్థితి ఇలా..

కర్నూలు(హాస్పిటల్‌)/గోస్పాడు: సమాజంలో నాగరికత పెరిగే కొద్దీ అనైతిక చర్యలు అధికమవుతున్నాయి. తప్పు చేసినా దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చనే ధీమా అధికమైంది. తప్పు చేస్తే వచ్చే వ్యాధైన ఎయిడ్స్‌ దీనికి ఉదాహరణ. మొదట్లో ఈ వ్యాధి అంటే బాగా భయపడేవారు. ఆ తర్వాత ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడొచ్చో తెలిసాక నెమ్మదిగా ఈ వ్యాధంటే భయం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇదంటే పూర్తిగా భయం పోయింది. ఈ కారణంగా మళ్లీ విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యభిచారం, అనైతిక సంబంధాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కేసులూ పెరుగుతున్నాయి. అయితే ఇందులో కొన్ని మాత్రమే రికార్డులకెక్కుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్‌ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పట్ల అవగాహన కల్పించడం కోసం, ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎదుర్కొనేందుకు అందరినీ దగ్గర చేసేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ ఒకటో తేదిన ప్రపంచ ఎయిడ్స్‌ అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏడు సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాలు(ఐసీటీసీలు), 74 ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్‌ ఐసీటీసీలు, మూడు సుఖవ్యాధుల చికిత్సా కేంద్రాలు, రెండు ఏఆర్‌టీ కేంద్రం(కర్నూలు, ఆదోని), మూడు లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు, మరో మూడు డిసిగ్నేటెడ్‌ ఎస్‌టీఐ/ఆర్‌టీఐ కేంద్రాలు, 14 రక్తనిధి కేంద్రాలు(ప్రభుత్వ, ప్రైవేటు), ఆరు రక్తనిల్వ కేంద్రాలు, ఐదు ప్రివెన్షన్‌ యూనిట్లు(టార్గెటెడ్‌ ఇంటర్‌వెన్షన్‌ ప్రాజెక్టు), ఒక లింక్‌ వర్కర్‌ ప్రాజెక్టు(చైల్డ్‌ ఫండ్‌ ఇండియా–44 గ్రామాల్లో), ఒక నేస్తం పాజిటివ్‌ నెట్‌వర్క్‌ ఉన్నాయి.

40 ఏళ్లలోపు వారే ఎక్కువ

జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితుల్లో 26 నుంచి 40 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బాధితుల్లో 14 ఏళ్లలోపు వారు 324 మంది, 15 నుంచి 25 ఏళ్లలోపు వారు 1,341 మంది, 26 నుంచి 40 ఏళ్లలోపు వారు 3,681 మంది, 41ఏళ్లపైబడిన వారు 2,252 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లలో 15 నుంచి 25ఏళ్లలోపు వారు 19 మంది, 26 నుంచి 40 ఏళ్లలోపు వారు 26 మంది, 41ఏళ్లు పైబడిన వారు 9 మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

అనైతిక సంబంధాలతో

పెరుగుతున్న కేసులు

సోషల్‌ మీడియా ప్రభావం కారణంగా ఇటీవల కాలంలో వ్యభిచారం విచ్చలవిడిగా మారింది. హోటళ్లు, లాడ్జిల గదులే గాకుండా నివాసిత ప్రాంతాల మధ్యలోనే యథేచ్ఛగా గుట్టుచప్పుడు గాకుండా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని వెబ్‌సైట్‌లు, వాట్సాప్‌ల ద్వారా కూడా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని దళారులు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు అనైతిక సంబంధాలు అధికమయ్యాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో కోరికలు తీర్చుకోవడానికి పరిచయాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని మరీ ఒక్కటవుతున్నారు. ఇలాంటి వారు కండోమ్‌లు వాడటం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరి ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కేసులు చాపకింద నీరులా పాకుతున్నాయి. వీరు ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. వీరి వివరాలు ప్రభుత్వ రికార్డులకు ఎక్కడం లేదు. మరోవైపు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించే రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌లు అంత చైతన్యవంతంగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా యువత ఎక్కువగా విచ్చలవిడి శృంగారం వైపు మళ్లి హెచ్‌ఐవీ బారిన పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

సాధారణ గర్భిణిలు

హెచ్‌ఐవీ హెచ్‌ఐవీ

బాధితులు బాధితులు

2018-19 1,383 69

2019-20 1,223 54

2020-21 576 47

2021-22 885 54

2022-23 620 36

2023-24 477 18

2024-25 450 10

2025 154 22

నంద్యాల జిల్లా ఏర్పాటు అయ్యాక 2022 ఏప్రిల్‌ నుండి 2025 అక్టోబర్‌ వరకు 2,44,640 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా 1502 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. అలాగే గర్భిణీ సీ్త్రలకు 1,61,113మందికి పరీక్షలు చేయగా 58 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో తగ్గాయంటున్న

ఎయిడ్స్‌ కేసులు

ఎయిడ్స్‌ కేసుల నమోదుపై

అనుమానాలు

విచ్చలవిడిగా వ్యభిచారం

అక్రమ సంబంధాలు

అదే స్థాయిలో...

బాధితుల్లో 26 నుంచి 40

ఏళ్లలోపు వారే ఎక్కువ

నేడు ప్రపంచ ఎయిడ్స్‌

అవగాహన దినం

నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా?1
1/1

నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement