కొత్తూరులో జడ్జి పూజలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి అభిషేకాలు, అర్చనలు చేశారు. శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈఓ రామకృష్ణ, అర్చకులు, సిబ్బంది తీర్థఽప్రసాదాలు అందించారు. నంద్యాల ఆడ్వొకేట్ రాజగోపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, అర్చకులు సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
యాగంటీశ్వరుడి సేవలో జేసీ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. జాయింట్ కలెక్టర్ దంపతులకు ఆలయ ఈఓ పాండురంగారెడ్డి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వెలసిన ఉమామహేశ్వరస్వామికి అర్చన అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జేసీ దంపతులను ఆలయ ఈఓ, అర్చకులు సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. జేసీ వెంట మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి, యాగంటిపల్లె గ్రామ ఉప సర్పంచ్‌బండి మౌలీశ్వరరెడ్డి, వీఆర్‌వో గోవిందప్ప తదితరులు ఉన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అవుకు(కొలిమిగుండ్ల): మండలంలోని మంగంపేటకు చెందిన బుర్రపెద్ద వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు పుల్లయ్య(36) ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుల్లయ్య మద్యానికి బానిసై రోజు ఇంటికి తాగి వస్తుండేవాడు. పనులకు పోకుండా ఖాళీగా తిరుగుతూ వచ్చాడు. ఈ విషయంలో పుల్లయ్య, భార్య హరిత మధ్య తరచూ గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ కోవలోనే భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో భర్త మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కొత్తూరులో జడ్జి పూజలు


