ఆన్‌లైన్ సేవలు పునరుద్ధరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో సాంకేతిక కారణాలతో వారం క్రితం నిలిచిన ఆన్‌లైన్ సేవలు పునరుద్ధరించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ.. మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. భక్తులందరూ దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని ఈఓ సూచించారు. ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చుననానరు. మల్లికార్జున స్వామివారి గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షకరాభాస్యం మొదలైన 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లనుఆన్‌లైన్ ద్వారా భక్తులు పొందవచ్చున్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్‌సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www. srisailadevasthanam.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు.


