వామ్మో.. వానరాలు!
● ప్రభుత్వ పాఠశాలల్లో కుప్పి గంతులు
● భయపడుతున్న విద్యార్థులు
గోనెగండ్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్‌కు కోతుల బెడద ఎక్కువైంది. దీంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణంలో 40 పైగా కోతులు ఉంటాయి. అవి పాఠశాల తరగతి గదులు, ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ రూమ్‌లలో వెలుతుండడంతో విద్యార్థులు భయపడుతున్నారు. విద్యార్థులు ఉదయం ప్రార్థనకి వెళ్లినప్పుడు, మధ్యాహ్నం సమయంలో భోజనానికి వెళ్లినప్పుడు కోతులు కిటీకీల నుంచి తరగతి గదులలోకి వెళ్లి బ్యాగులను తీయడం(చించడం) అందులో ఉన్న పుస్తకాలు బయటకు పారవేయడం, చించివేయడం, విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారెర్ బ్యాక్సులను తినడంతో పాటు చల్లడం లాంటి పనులు చేస్తున్నాయి. విద్యార్థులను కరిచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నారు. ప్రతి రోజు కోతులు తరగతి గదిలోకి వెళ్లి బ్యాగులు తీయడం, క్యారెర్ బాక్సులను తీనడం జరుగుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల ఆవరణంలో ఉన్న కోతులను పట్టుకొని గ్రామాలకు దూరంగా వదిలివేయాలని కోరుతున్నారు.


