వేప చెట్టుకు విపత్తు
వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఆశించే వివిధ చీడపీడల నివారణకు వేపతో తయారయ్యే ఉత్పత్తులు సమర్థవంతంగా పనిచే స్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేపాకు, వేపకాయలు, వేపపిండి, వేప చెక్క, వేపనూనెతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్టుకు మళ్లీ కష్టమొచ్చింది. వింత తెగులుతో చాలా చోట్ల చెట్లు ఎండిపోతున్నాయి. ఆకులు, రెమ్మలు, కొమ్మలు సహా ఎర్రబారిపోతున్నాయి. కరోనా సమయంలోనూ ఇదే మాదిరిగా వేప చెట్లు ఎండిపోయి తిరిగి చిగురించాయి. మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. వేపచెట్లను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
– గడివేముల/తుగ్గలి


