జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు
వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్‌బ్యాంకులో ఎక్కువ రక్తసేకరణ చేసినందుకు బ్లడ్‌బ్యాంకుకు, పాజిటివ్ వచ్చిన వారికి ఏఆర్‌టీ కేంద్రానికి అనుసంధానం చేయడంలో భాగంగా ఐసీటీసీ కేంద్రాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వచ్చాయి. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని డిసెంబర్ ఒకటో తేదీన విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో హెచ్‌ఓడీలు, సిబ్బంది ఈ అవార్డులు అందుకుంటారు. అలాగే ఒకటిన కర్నూలులో జిల్లా పరిపాలన, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థినీ విద్యార్థుల భాగస్వామ్యంతో కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు భారీ ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. –డాక్టర్ ఎల్. భాస్కర్, డీఎంహెచ్‌వో, కర్నూలు


