5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 5న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(మెగా పీటీఎం) కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పీటీఎం విజయవంతానికి 13 కమిటీలను నియమించామన్నారు. సమావేశాల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై చర్చ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ శ్యామూల్‌పాల్ పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతుకు నిధులు
జిల్లాలో పాడైన రహదారుల మరమ్మతుకు రూ.105.66 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 222.18 కిలోమీటర్ల పొడవుకు సంబంధించి 30 రోడ్లలో మరమ్మతులు చేపడతారని పేర్కొన్నారు.


