విధిరాత.. మృత్యుగీత
(ఇన్‌సెట్) ఎయిర్ బెలూన్ తెరుచుకోకపోవడంతో మృతి చెందిన సతీష్‌కుమార్, చిన్నారి బనిత్‌గౌడ్
మరో గంటలో దేవుడి సన్నిధి చేరి వివాహ వేడుకను నిర్వహించుకోవాల్సిన దంపతులతోపాటు వారి కుమారుడు, మరో ఇద్దరి కుటుంబీకులను మృత్యువు పొట్టన పెట్టుకుంది. పెళ్లి రోజే ఆ దంపతులకు చివరి రోజయ్యింది. పొగ మంచు మాటున మృత్యువు మాటు వేసి ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటేకల్ గ్రామం కొండ మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. రెండు కార్లు ఢీకొన్న సంఘటన స్థలంలో దృశ్యాలు ప్రజలను కలిచివేశాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటంతో చూసిన వారందరూ అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కారు ముందు సీట్‌లో ఉన్న సతీ్‌ష్ కుమార్, అతని ఒడిలో ఉన్న బావ కుమారుడు బనీత్ విగతజీవులుగా ప్రాణాలు విడిచారు. వెనుక సీటులో ఉన్న సతీష్ కుమార్ భార్య మీనాక్షి, నాలుగేళ్ల కుమారుడు రుత్విక్, మీనాక్షి తండ్రి వెంకటేషప్ప తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆసుపత్రిలోని మార్చురీ వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. – ఎమ్మిగనూరు రూరల్
విధిరాత.. మృత్యుగీత
విధిరాత.. మృత్యుగీత
విధిరాత.. మృత్యుగీత
విధిరాత.. మృత్యుగీత
విధిరాత.. మృత్యుగీత
విధిరాత.. మృత్యుగీత


